రోడ్డు కబ్జా చేసిన సెజ్ స్కూల్ యాజమాన్యం.. కబ్జా చేసిన ప్రాంతం కూల్చివేత…
మేడిపల్లి: మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని సెజ్ స్కూల్ యాజమాన్యం కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఫీర్జాదిగూడ సర్వే నంబర్ 26ఎ, సిపిఆర్ఐ పవర్ సంస్థ, సెజ్ స్కూల్ ప్రాంగణంలో ఆర్ఎఆర్ కాలనీకి సంబందించిన రోడ్డు కబ్జా చేసి ఆ ప్రాంతం లో నిర్మాణాలు చేపట్టారని కాలనీ వాసులు ఇటీవల హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు సిఐ. సైదులు నేతృత్వంలో బుధవారం హైడ్రా అధికారులు చేరుకుని జెసిబిలతో రోడ్డు అక్రమాణలను పూర్తిగా నేలమట్టం చేశారు. గత 15 సంవత్సరాలుగా రోడ్డు కబ్జాపై పోరాడుతున్నామని, హైడ్రా మూలంగా ఇన్నేళ్లకు తమ కాలనీకి సంబంధించిన రోడ్డు వినియోగంలోకి రానుందని సంతోషం వ్యక్తం చేశారు.