Saturday, July 26, 2025

ఆ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: రంగనాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాలాల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వచ్చే నాలుగు నెలల పాటు నాలాలపైనే దృష్టి పెడుతామని, హైదరాబాద్‌లో వరద నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేక అధ్యయనం చేస్తున్నామని, నాలా, నీటి వనరుల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాలాలపై అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను తొలగిస్తామని, నాలాలపై పేదల నిర్మాణాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అక్రమణల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బంది పడకూడదని హెచ్చరించారు. రసూల్‌పురా నాలాపై ఆక్రమ నిర్మాణాలను కూల్చివేశామని రంగనాథ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News