Saturday, August 2, 2025

పదేళ్ల వేడుక జరుపుకుంటున్న హ్యుందాయ్ క్రెటా

- Advertisement -
- Advertisement -

గురుగ్రామ్: గౌరవం, వారసత్వం, భావోద్వేగాలతో నిండిన క్షణంలో, హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా 10 అద్భుతమైన సంవత్సరాలను వేడుక జరుపుకుంటుంది. జూలై 2015లో మిడ్-ఎస్ యువి విభాగంలోకి హెచ్ఎంఐఎల్ యొక్క సాహసోపేతమైన అడుగుగా ప్రారంభమైనప్పటికీ , నేడు 1.2 మిలియన్ల భారతీయ గృహాలలో శక్తి, శైలి మరియు ఆకాంక్షకు పర్యాయపదంగా ఇది మారింది. మార్కెట్ లోకి వచ్చిన నాటి నుంచి , హ్యుందాయ్ క్రెటా ఒక అద్భుతంగా నిలిచింది. దాని ప్రభావం ఎంతగా ఉందంటే, మిడ్-సైజ్ ఎస్యువి విభాగాన్ని ఇప్పుడు దేశంలో “క్రెటా విభాగం” అని పిలిచేంతగా ! పోటీ పెరిగినప్పటికీ, హ్యుందాయ్ క్రెటా 2015లో విడుదల అయినప్పటి నుండి ప్రతి సంవత్సరం దేశంలో తిరుగులేని రీతిలో నంబర్ 1 స్థానాన్ని కొనసాగిస్తూ, ముందు వరుసలో ఉంది.

ఈ మైలురాయి గురించి హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అన్సూ కిమ్ మాట్లాడుతూ, “హ్యుందాయ్ క్రెటా ప్రయాణం భావోద్వేగభరితమైనది, మాకు మాత్రమే కాదు, దానిని తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్న ప్రతి కస్టమర్‌కు ఇది ప్రత్యేకమైనది. ఇది కలలు, స్వేచ్ఛ మరియు పురోగతి కోసం నిలబడింది. క్రెటా కేవలం ఒక ఉత్పత్తి కాదు, ఇది చక్రాలపై ఒక విప్లవం. గత 10 సంవత్సరాలుగా, ఇది భారతీయ ఎస్ యువి కొనుగోలుదారుకు అత్యున్నత ప్రమాణంగా మారింది. క్రెటా ప్రయాణంలోని ప్రతి మైలురాయి ఆవిష్కరణ, నాణ్యత మరియు కస్టమర్-ఫస్ట్ ఆలోచనా విధానం పట్ల హ్యుందాయ్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో క్రెటా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, భారతదేశం ఎస్యువి లను నడిపించే విధానాన్ని మార్చిన ఒక ఉద్యమాన్ని మేము వేడుక జరుపుకుంటున్నాము. మా కస్టమర్‌లు మాపై చూపిన ప్రేమ, నమ్మకం మరియు విధేయతకు మేము నమస్సుమాంజులను తెలుపుతున్నాము. అత్యున్నత శ్రేణి ఉత్పత్తులతో వారిని ఆకట్టుకునేందుకు మేము కట్టుబడి ఉన్నాము” అని అన్నారు.

క్రెటా యొక్క 10 సంవత్సరాల మైలురాయి గురించి హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ హోల్-టైమ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “హ్యుందాయ్ క్రెటా ఒక మోడల్ కంటే ఎక్కువ, ఇది ఒక సజీవ వారసత్వం, జాగ్రత్తగా రూపొందించబడింది, సాంకేతికతతో అభివృద్ధి చెందింది మరియు దానిని తమదిగా చేసుకున్న మిలియన్ల మంది కస్టమర్ల మద్దతును కలిగి ఉంది. ఆశయం, పురోగతి మరియు నమ్మకాన్ని హ్యుందాయ్ క్రెటా సూచిస్తుంది. భారతదేశం యొక్క ఎస్యువి కోరికలు పెరిగే కొద్దీ, క్రెటా కూడా వాటితో పాటు పెరిగింది. ఈ కోరికలను ఎంతో ముందుగానే ఆలోచించి తగినట్లుగా తమ వాహనాలను రూపొందిస్తుందని నేను ధైర్యంగా చెప్పగలను. 2015లో కేవలం 2 మోడళ్ల నుండి నేడు 12 మోడళ్లకు అభివృద్ధి చెందిన మిడ్-ఎస్యువి విభాగంలో ఇప్పుడు తీవ్ర పోటీ ఉంది, అయినప్పటికీ ఆ విభాగాన్ని సృష్టించడంలో సహాయపడిన హ్యుందాయ్ క్రెటా, ఆ విభాగాన్ని ముందుకు నడిపిస్తూ, అభివృద్ధి చెందుతూ , నిర్వచిస్తూనే ఉంది. నేడు, మనం ఒక దశాబ్దపు ఆవిష్కరణ, నాయకత్వం మరియు అచంచలమైన కస్టమర్ నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్న వేళ, స్మార్ట్, సస్టైనబుల్ మరియు మానవత్వం ద్వారా ప్రేరణ పొందిన మొబిలిటీని అందించడానికి దాని నిబద్ధతను హ్యుందాయ్ పునరుద్ఘాటిస్తుంది” అని అన్నారు.

సంఖ్యలలో హ్యుందాయ్ క్రెటా – వివాదాలు లేని ప్రయాణం . అత్యుత్తమ నాయకత్వం.

• క్రెటా ను విడుదల చేసినప్పటి నుంచి దాని వార్షిక అమ్మకాలు రెండింతలు పెరిగాయి (సివై 2016లో 92,926 యూనిట్లు, 2024లో 186,919 యూనిట్లు) డిమాండ్ మరియు వాంఛనీయతలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

• భారతదేశంలో 1.2 మిలియన్లకు పైగా క్రెటా లు అమ్ముడయ్యాయి, ఇది మిడ్-సైజ్ ఎస్ యువి రంగంలో అసమానమైన ఘనత చాటింది.

• భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమలో 31% కంటే ఎక్కువ మార్కెట్ వాటాతో మిడ్-సైజ్ ఎస్ యువి విభాగంలో క్రెటా ఆధిపత్యం చెలాయిస్తోంది

• సన్‌రూఫ్ పవర్డ్ వేరియంట్లు క్రెటా అమ్మకాలకు 70% దోహదపడతాయి (జనవరి-జూన్ 2025)

• సివై 2025లో (జనవరి-జూన్), హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్ యువి గా నిలిచింది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 3 నెలల్లో అన్ని విభాగాలలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అవతరించింది.

• హ్యుందాయ్ క్రెటాలో మొదటిసారి కార్లను కొనుగోలు చేసే వారి వాటా 2020లో 12% నుండి 2024లో 29%కి పెరిగింది

• పెట్రోల్, డీజిల్, టర్బో మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ క్రెటా మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను అందిస్తుంది

• భారతదేశంలో తయారు చేయబడిన క్రెటా 13 దేశాలకు ఎగుమతి చేయబడింది మరియు ఇప్పటివరకు, హెచ్ఎంఐఎల్ 2.87 లక్షల యూనిట్లకు పైగా ఎగుమతి చేసింది.

ఇప్పుడు తమ రెండవ తరంలో, హ్యుందాయ్ క్రెటా బెంచ్‌మార్క్‌లను పునర్నిర్వచించింది, ఒక పురోగతి మోడల్ నుండి భారతదేశ ఎస్యువి రంగపు చిహ్నంగా పరిణామం చెందుతోంది. గత దశాబ్దంలో, హ్యుందాయ్ క్రెటా యొక్క ప్రయాణం కేవలం కొత్త వేరియంట్‌లను విడుదల చేయటం ద్వారా మాత్రమే కాకుండా, నేటి వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా దాని అవిశ్రాంత పరిణామం ద్వారా నిర్వచించబడింది. మిగిలిన వారి కంటే ముందు ఉండాలనే నిబద్ధతతో, హ్యుందాయ్ నిరంతరం క్రెటా యొక్క ముఖ్య ప్రత్యేకతలు , పవర్‌ట్రెయిన్, ట్రాన్స్‌మిషన్ మరియు టెక్నాలజీకి అర్థవంతమైన నవీకరణలను చేస్తూనే ఉంది. దాని సాధారణ అప్‌గ్రేడ్‌లతో పాటు, హ్యుందాయ్ రెండు ప్రత్యేక ఎడిషన్‌లు – నైట్ ఎడిషన్ మరియు అడ్వెంచర్ ఎడిషన్- ను విడుదల చేసింది ప్రతి ఒక్కటి విభిన్న జీవనశైలి మరియు ఆకాంక్షలను ప్రతిబింబించేలా జాగ్రత్తగా రూపొందించబడింది, విస్తృత శ్రేణిలో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. రెండు ప్రత్యేక ఎడిషన్‌లు విజయగాథలుగా నిరూపించబడ్డాయి, వినియోగదారుల అంచనాలను ఒడిసిపట్టాయి మరియు క్రెటా యొక్క వైవిధ్యత , ఆకర్షణను పునరుద్ఘాటించాయి. సంవత్సరాలుగా, హ్యుందాయ్ క్రెటా కేవలం ఒక ఎస్యువి గా దాని గుర్తింపును అధిగమించింది, ఇది ఒక భావోద్వేగంగా, ప్రతి ఎస్యువి ప్రేమికుని నడుమ లోతుగా ప్రతిధ్వనించే ఆకాంక్షకు చిహ్నంగా మారింది.

హ్యుందాయ్ క్రెటా బ్రాండ్ పొజిషనింగ్ ప్రతి తరంతో శక్తివంతంగా అభివృద్ధి చెందింది, దాని పెరుగుతున్న విజయాన్ని మరియు అది ఎస్యువి విభాగానికి తీసుకువచ్చిన సాహసోపేతమైన మార్పులను ప్రతిబింబిస్తుంది. “ఎ పర్ఫెక్ట్ ఎస్యువి”గా తొలుత 2015లో విడుదల చేయబడినది, ఈ ట్యాగ్‌లైన్ శ్రేష్ఠతకు మార్గాన్ని నిర్దేశించింది. 2020లో, రెండవ తరం క్రెటా “ది అల్టిమేట్ ఎస్యువి”తో దాని గుర్తింపును పెంచుకుంది. 2024లో జరిగిన నవీకరణల తరువాత ఈ పరిణామం మరింత పెరిగింది, గర్వంగా “ది అన్‌డిస్ప్యూటెడ్ అల్టిమేట్ ఎస్యువి” అనే ట్యాగ్‌లైన్‌ను సంపాదించింది.

హ్యుందాయ్ క్రెటా 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ..

• యుజిసి పోటీ – దాని ఐకానిక్ ఎస్యువి, అన్‌డిస్ప్యూటెడ్ అల్టిమేట్ క్రెటా యొక్క 10వ వార్షికోత్సవాన్ని వేడుక జరుపుకోవడానికి, ‘క్రెటా X మెమోరీస్’ పేరిట వినియోగదారు-సృష్టించిన డిజిటల్ పోటీ ప్రచారాన్ని హెచ్ఎంఐఎల్ ప్రారంభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News