Monday, August 25, 2025

సీటు రాకపోయినా జగనన్న సైనికురాలినే: రోజా

- Advertisement -
- Advertisement -

తనపై ప్రతిపక్షాలు అసత్యప్రచారం చేస్తున్నాయని పర్యాటక మంత్రి రోజా మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనకు సీటు రాదని ప్రచారం చేస్తున్నారని ఆమె చెబుతూ, సీటు రాకపోయినా తాను జగనన్న సైనికురాలినేనని స్పష్టం చేశారు. మంగళవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం, మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓడిపోతామనే భయంతో రెండేసి నియోజకవర్గాల్లో సర్వే చేయించుకుంటున్నారని రోజా ఎద్దేవా చేశారు. తాను ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుంటున్నాననీ, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News