Sunday, September 14, 2025

బెట్టింగ్ యాప్‌లను ఇక ప్రమోట్ చేయను

- Advertisement -
- Advertisement -

నిర్వాహకుల నుంచి నాకు
ఎలాంటి డబ్బులు అందలేదు
సినీనటుడు ప్రకాశ్‌రాజ్ వెల్లడి
ఇడి విచారణకు హాజరు
జంగిల్ రమ్మీ ద్వారా లబ్ధి
పొందినట్లు ఆరోపణలు

బెట్టింగ్ యాప్‌ల ప్రచారంలో తనకు నిర్వాహకుల నుంచి ఎటువంటి డబ్బులు అందలేదని సినీ నటుడు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో బుధవారం ఆయన ఇడి విచారణకు హాజరయ్యారు. ఐదు గంటల పాటు ఇడి అధికారు లు ప్రకాశ్‌రాజ్‌ను విచారించారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇకనుంచి బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేయనని స్పష్టం చేసారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించాలని ఎవరూ భావించకూడదని సూచించారు. ఇడి అధికారులు తాను చెప్పిన విషయాలు నమోదు చేసుకున్నారన్నారు. విచారణకు ఇడి అధికారులు తనను మళ్లీ పిలవలేదని తెలిపారు.

కాగా దుబా య్ నుంచి ఆపరేట్ అవుతున్న బెట్టింగ్ యాప్స్‌ను ప్రకాష్‌రాజు ప్రమోట్ చేసినట్టు ఇడి అభియోగం మోపింది. బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును సినీ నటులు దుబాయ్‌లోనే పెట్టుబడులు పెట్టి నట్లు ఇడి అధికారులు అనుమానిస్తున్నారు. ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసిన నటుల ఐదు సంవత్సరాల ఆర్థిక లావాదేవీలను ఇడి అధికారులు పరిశీలిస్తున్నారు.కాగా తన బ్యాంకు స్టేట్‌మెంట్‌లను ఇడికి ప్రకాష్‌రాజ్‌కి అందజేశారు. జంగిల్ రమ్మీ ద్వారా భారీగా ప్రకాష్‌రాజ్ లాభపడినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయడంపై స్పందిస్తూ, జంగిల్ రమ్మీతో కాంట్రాక్ట్ పూర్తి అయ్యాక మళ్లీ రెన్యూవల్ చేయలేదని మళ్లీ ఇంకె ప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయబోనని ప్రకాశ్‌రాజ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News