Wednesday, August 6, 2025

నాపై వచ్చే రాజకీయ విమర్శలను పట్టించుకోను: చిరంజీవి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తాను రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అయినప్పటికీ.. కొంతమంది నేతలను తనను విమర్శిస్తూనే ఉంటారని, సోషల్‌మీడియాలో తనపై అవాకులు చవాకులు పేలుస్తుంటారని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఫీనిక్స్ ఫౌండేషన్ నిర్వహించిన వైద్య శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా వచ్చే విమర్శలపై తాను పెద్దగా స్పందించను అని తేల్చి చెప్పారు. తాను చేసిన సేవా కార్యక్రమాలు, పంచిన ప్రేమాభిమానాలే తనకు రక్షణ అని అన్నారు.

‘‘నేను మాట్లాడక్కర్లేదు.. నేను చేసిన మంచే మాట్లాడుతుంది. నాపై ఓ నేత విమర్శలు చేస్తే రాజమండ్రిలో ఓ మహిళ అడ్డుకొని నిలదీసింది. నాపై చెడు రాతలు, మాటలకు నేను చేసే మంచే సమాధానం. మంచి చేస్తూ.. మంచి చేసే తమ్ముళ్లకు సహకారించడమే నాకు తెలుసు’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఫాంటసీ యాక్షన్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యువి క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News