Monday, July 21, 2025

నాకు ఇరు దేశాలంటే ప్రేమనే.. భారత్-పాక్ మ్యాచ్ రద్దుపై బ్రెట్‌లీ

- Advertisement -
- Advertisement -

పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఎలాంటి విషయంలోనూ రాజీ పడకూడదని భారత్ నిర్ణయించుకుంది. దీంతో వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్-2025లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడకూడదని భారత మాజీలు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ మ్యాచ్ రద్దైంది. దీనిపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్‌ లీ (Brett Lee) కీలక వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ గురించి అడిగిన ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం ఇచ్చారు.

‘‘నేను ఒకటే చెబుతా.. ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ పాకిస్థాన్. భవిష్యత్తులో ఇరు జట్లు కలిసి ఆడే పరిస్థితి వస్తుందని కోరుకుంటున్నా. ప్రస్తుతం మేం టోర్నమెంట్‌లో ఉన్నాం. ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఇలా అందరం కలిసి ముందుకెళ్తాం. కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ మ్యాచ్ రద్దైంది. కానీ, మేమంతా మ్యాచ్ జరిగితే బాగుండేదని అనుకున్నాం’’ అని బ్రెట్‌ లీ (Brett Lee) సమాధానం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News