Saturday, July 19, 2025

హైదరాబాద్‌ అంటే నాకు చాలా ఇష్టం: ఓపల్‌ సుచాత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ అంటే తనకు చాలా ఇష్టమని మిస్‌ వరల్డ్‌ విజేత ఓపల్‌ సుచాత అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..మిస్‌ వరల్డ్‌ కావాలన్నది తన కల అని చెప్పింది. “ఇన్నాళ్లకు నా కల నెరవేరింది. తెలంగాణ ఆతిథ్యం బాగుంది. ఇక్కడ చౌమహల్లా ప్యాలెస్‌, పిల్లలమర్రి చాలా బాగున్నాయి. ఓపల్ ఫర్‌ హర్‌ ప్రాజెక్టు కోసం మరింత కృషి చేస్తా” అని ప్రపంచ సుందరి ఓపల్‌ సుచాత పేర్కొన్నారు.

కాగా, శనివారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరిగిన 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయ్‌లాండ్ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా చేతుల మీదుగా ఓపల్ సుచాత ధరించారు. ఈ పోటీల్లో 1వ రన్నర్ అప్‌గా ఇథియోపియా, 2వ రన్నర్ అప్ మిస్ పోలాండ్, 3వ రన్నర్ అప్‌గా మిస్ మార్టినిక్ నిలిచారు. మిస్ వరల్డ్ గా ఎంపికైన సుచాతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ అందజేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News