హైదరాబాద్: స్పీకర్ నోటీస్‌కు సమాధానం ఇచ్చానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. తాను బిఆర్ఎస్‌లోనే ఉన్నానని, ఇదే అంశాన్ని స్పీకర్ నోటీస్‌కు సమాధానంగా పంపానని, ముఖ్యమంత్రిని కలిసిన వివరాలు పొందుపరిచానని, తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని స్పష్టం చేశారు. బిఆర్ఎస్ ఎంఎల్ఎలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్ కుమర్, కృష్ణమోహన్, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలు కాంగ్రెస్ పార్టీలో చేరారని వారిపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని స్పీకర్ కు సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో సదరు ఎంఎల్ఎలకు స్పీకర్ నోటీసులు పంపించారు.
Also Read: గుంటూరు జిల్లాలో ఒకే గ్రామంలో 28 మంది మృతి.. ఎందుకు? ఏమిటి? ఎలా?