Tuesday, May 13, 2025

అణుయుద్ధంతో జరిగే వినాశనాన్ని ఆపాను: ట్రంప్

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్: ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్(India), పాకిస్థాన్‌ల(Pakistan) మధ్య ఉద్రక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. ఈ పరిస్థితులు చూసి అంతా యుద్ధం వస్తుందని భావించారు. కానీ, అనూహ్యంగా ఇరుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే ఇది అమెరికా వల్లే జరిగిందని ఆ దేశ అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు.

కాగా, సోమవారం కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్(India), పాకిస్థాన్‌ల డిజిఎంవొలు చర్చలు జరిపారు. హాట్‌లైన్ ద్వారా ఇరు దేశాల అధికారులు గంటపాటు ఈ అంశంపై చర్చించారు. అంతేకాక.. రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

రెండు అణ్వాయుధ దేశాలైన భారత్-పాకిస్థాన్‌ల(Pakistan) మధ్య యుద్ధాన్ని నివారించింది తానే అని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘అణుయుద్ధం జరిగి ఉంటే వినాశనం జరిగి ఉండేది.. లక్షల మంది ప్రాణాలు పోయేవి. యుద్ధ నివారణలో జెడి వాన్స్, రుబియో కృషి ప్రశంసనీయం. యుద్ధ నివారణలో వాణిజ్యాన్ని నేను వాడినట్టు ఎవరూ వాడలేదు. భారత్‌-పాక్ మధ్య యుద్ధ నివారణకు మధ్యవర్తిత్వం వహించా. భారత్, పాకిస్థాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరిపాం. కాల్పుల విరమణకు బారత్, పాకిస్థాన్‌లను ఒప్పించాం. కాల్పు విరమణకు వాణిజన్యాన్నే ఆయుధంగా చేసుకున్నాం. కాల్పుల విరమణ జరగకపోతే వాణిజ్యం ఆపేస్తానని చెప్పా. నేను చెప్పగానే కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయి. భారత్, పాక్‌ కాల్పుల విరమణ శాశ్వతం అవుతుందని ఆశిస్తున్నా. నా మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్‌ విజ్ఞత ప్రదర్శించాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News