Thursday, May 29, 2025

మా వాళ్ల ఆట చూసి నాకే భయమేసింది: కమ్మిన్స్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో తమ పయనాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఘన విజయంతో ముగించింది. ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని 110 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ సీజన్‌ని ఘన విజయంతో ఆరంభించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుస ఓటములను చవిచూసింది. దీంతో ప్లేఆఫ్స్‌ను చేరుకోలేకపోయింది. కానీ, చివరి లీగ్‌ మ్యాచ్‌లలో మాత్రం అద్భుత ప్రదర్శన చేసి.. ఫ్యాన్స్‌కి మంచి ట్రీట్ ఇచ్చింది. కోల్‌కతాపై విజయం తర్వాత జట్టు కెప్టెన్ పాట్ కమ్మిన్స్ (Pat Cummins) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ మ్యాచ్‌లో తమ వాళ్ల ఆట చూసి తనకే భయం వేసిందని కమ్మిన్స్ (Pat Cummins) సరదాగా అన్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌లో (SRH) అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని.. ఫైనల్స్‌ చేరే సత్తా ఉన్నా.. దాన్ని సాధించలేకపోయామని పేర్కొన్నాడు. ఢిల్లీ వికెట్ మీద తమ ఆటగాళ్లు అదరగొట్టారని కొనియాడాడు. ఈసారి తమ జట్టు బాగానే ఉందని.. కానీ, కొంతమంది గాయాల కారణంగా స్వదేశానికి వెళ్లరాని తెలిపాడు. 20 మంది ఆటగాళ్ల సేవలను జట్టు ఉపయోగించుకుందని అన్నాడు.

ఇక ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల అల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. బ్యాటింగ్‌లో క్లాసెన్(105) వీరోచిత ఇన్నింగ్స్ ఆడగా.. హెడ్ (76), అభిషేక్ (32) రాణించడంతో సన్‌రైజర్స్ 278 పరుగులు చేసింది. బౌలింగ్‌లోనూ రైజర్స్ సత్తా చాటడంతో కోల్‌కతా 18.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News