- Advertisement -
హైదరాబాద్: వ్యవసాయం, చేనేత శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం భూదాన్ పోచం పల్లి అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ లాగే.. నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తున్నామని హామీ ఇచ్చారు. ఐఎహెచ్ టిని భూదాన్ పోచంపల్లిలో నిర్మిస్తామని తెలియజేశారు. చేనేత కార్మికుల సమస్యలను కెబినేట్ లో చర్చిస్తామని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలతో పోచంపల్లి మండలంలో రైతు భరోసా రాలేదన్నారు. త్వరలోనే రైతు భరోసా అర్హులైన వారి ఖాతాలో జమ అవుతుంది తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
- Advertisement -