ఎపి ఐఎఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో ఆమెను నిందితురాలిగా తొలగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆమెను నిందితురాలిగా కొన సాగించేందుకు తగిన ఆధా రాలు ఉన్నాయని పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును మరోసారి విచారించాలని తెలంగాణ హైకోర్టుకు పంపిం ది. దీనిపై తాజాగా తెలం గాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ శ్రీలక్ష్మిని తిరిగి నిందితురాలిగా చేరుస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని తిరిగి శ్రీలక్ష్మి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శ్రీలక్ష్మి పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమెకు ఊరటనిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇస్తూ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు కూడా పంపింది.
శ్రీలక్ష్మిని ఒఎంసి కేసులో నిందితురాలిగా చేరుస్తూ తాజాగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.దీనిపై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా తన విషయంలో తెలంగాణ హైకోర్టు గతంలో ఓ తీర్పు ఇచ్చి ఇప్పుడు సిబిఐ అభ్యంతరాల తో తీర్పును మార్చి ఇవ్వడాన్ని శ్రీలక్ష్మి సవాల్ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి ఒఎంసి కేసులో ఆమెను నిందితురాలి గా కొనసాగించకుం డా తాత్కాలిక స్టే ఇచ్చింది. ఇదే కేసులో గతంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. అలాగే ఇతర నిందితుల కు కూడా ఊరట కల్పించారు. కానీ ఐఎఎస్ శ్రీలక్ష్మికి మాత్రం తెలంగాణ హైకోర్టులో దక్కిన ఊరట అతి కొద్ది కాలం లోనే ఆవిరైంది. దీంతో ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ కేసులో ఇచ్చే తుది తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆమె పదవీకాలం వచ్చే ఏడాది తో పూర్తి కానుంది. దీంతో రిటైర్మెంట్ లోపు ఈ కేసు నుంచి బయటపడేందుకు శ్రీలక్మి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.