Saturday, September 13, 2025

హెచ్ పి పెట్రోల్ బంకులో మోసాలు…. లీటర్ పెట్రోల్ లో అర లీటర్ నీళ్లు

- Advertisement -
- Advertisement -

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం మండలం శెర్రిగూడ హెచ్ పి పెట్రోల్ బంక్‌లో నీళ్లు కలిసిన పెట్రోల్ కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోగా ఈ రోజు తన కారు ఆగిపోయింది. బంక్ వద్దకు వచ్చి వాటర్ బాటిల్‌లో పెట్రోల్ కొట్టించగా, అందులో కూడా నీళ్లు ఉన్నట్లు తేలడంతో సిబ్బందితో ఘర్షణ పడ్డాడు. లీటర్ పెట్రల్ లో అర లీటర్ నీళ్లు కలుపుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. పెట్రోల్ లో నీళ్లు కలపడంతో ఇంజన్లు దెబ్బతింటున్నాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: అందెల రవమిది’ వచ్చేస్తోంది

పెట్రోల్ బంకుల మోసాలపై అధికారులు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ బంకుల యాజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, పెట్రోల్ పంపుల యజమానులు మోసాలకు పాల్పడుతుండడంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వాహనదారులు వాపోతున్నారు. గతంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం పరిదిలో నల్ల చెరువుకట్ట సమీపంలో భారత్ పెట్రోల్ పంపులో ఓ వాహనదారుడు లీటర్ పెట్రోల్ బాటిల్‌లో కొట్టించడంతో పెట్రోల్ తక్కువ రావడంతో పెట్రోల్ బంకు యాజమాని మోసం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News