Tuesday, September 9, 2025

ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నామినేటైన సిరాజ్‌

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా టీమిండియా బౌలర్ మొహమ్మద్ సిరాజ్ నామినేట్ అయ్యాడు. ఆగస్టు 2025 ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలను ఐసిసి సోమవారం ప్రకటించింది. ఇటీవల ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన సిరాజ్ కూడా నామినీలలో చోటు దక్కించుకున్నాడు. ఈ అవార్డుకు సిరాజ్ తోపాటు మరో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జేడెన్ సీల్స్, మాట్ హెన్రీ నామినేట్ అయ్యారు.

సిరాజ్ విషయానికి వస్తే.. ఆగస్టులో ఒకే ఒక మ్యాచ్ ఆడినా.. అద్భుత ప్రదర్శనతో నామినేషన్ కు అర్హత సాధించాడు. ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో 21.11 సగటుతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు సిరాజ్. రెండు ఇన్నింగ్స్‌లలో 46 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News