Wednesday, July 16, 2025

ఇంగ్లండ్‌కు షాక్.. భారీ జరిమానా విధించిన ఐసిసి

- Advertisement -
- Advertisement -

టీం ఇండియాపై లార్డ్స్ టెస్ట్‌లో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టుకు  (England Team) ఐసిసి షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్లో ఓవర్ రేటు పాటించిన నేపథ్యంలో ఆ జట్టుకు ఐసిసి భారీ జరిమానా విధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో 10 శాతం కోత విధించింది. అంతేకాక.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లలో రెండు పాయింట్లు కట్ చేసింది. ఎమిరేట్స్ ఐసిసి ఎలైట్ ప్యానెల్ ఆఫ్ ది మ్యాచ్ రెఫరీస్ సభ్యుడు రిచీ రిచర్డ్‌సన్ ఆదేశాల మేరకు ఇంగ్లండ్‌పై తగిన చర్యలు తీసుకున్నారు.

సాధారణంగా స్లో ఓవర్ రేట్లు‌లో ఒక ఓవర్‌కి 5 శాతం కోత విధిస్తారు. అయితే ఇంగ్లండ్ (England Team) రెండు ఓవర్లు వెనుకబడి ఉందని రిచర్డ్‌సన్ పేర్కొన్నారు. స్లో ఓవర్ రేటు అనేది ఐసిసి కోడ్ ఆఫ్ కాండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందకి వస్తుందని ఆయన తెలిపారు. దీంతో పాటు ఆర్టికల్ 16.11.2 ప్రకారం ఒక్కో స్లో ఓవర్‌ రేటు ఓవర్‌కు ఒక రేటింగ్ పాయింట్ కోత ఉంటుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ బెన్ స్టోక్స్ నేరాన్ని అంగీకరించాడు. దీంతో అధికారిక విచారణ లేకుండా ఈ శిక్ష అమలు అవుతుంది అని రిచర్డ్‌సన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News