అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా టెస్ట్ ర్యాంకులను (ICC Test Rankings) ప్రకటించింది, లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్రకటించిన ఈ ర్యాంకులలో బౌలింగ్‌లో భారత స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా మొదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో సఫారీ బౌలర్ కగిసో రబాడా నిలిచాడు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఆరు స్థానాలు ఎగబాక ఆరో స్థానంలో నిలచి తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఇక టప్-10 బౌలర్లలో ఐదుగురు ఆస్ట్రేలియా బౌలర్లు ఉన్నారు. పాట్ కమ్మిన్స్ 3, హేజిల్‌వుడ్ 4, నాథన్ లైయన్ 8, మిచెల్ స్టార్క్ 10 ర్యాంకులో ఉన్నారు.
ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings) విషయానికొస్తే.. జో రూట్ తిరిగి తన నెం.1 స్థానాన్ని దక్కించుకున్నాడు. మూడో టెస్ట్‌లో రూట్ రాణించిన విషయం తెలిసిందే. ఇక హ్యారీ బ్రూక్ మూడో స్థానానికి పడిపోగా.. రెండో స్థానంలోకి కేన్ విలియమ్‌సన్ వచ్చాడు. నాలుగో స్థానంలోకి జైస్వాల్‌ని వెనక్కినెట్టి స్టివ్ స్మిత్ వచ్చాడు. రిషబ్ పంత్ ఎనిమిదో స్థానానికి, శుభ్‌మాన్ గిల్ తొమ్మిదో ర్యాంకుకు పడిపోయారు.