హైదరాబాద్: తమ ప్రవాస భారతీయ (ఎన్ఆర్ఐ) కస్టమర్లు ఇప్పుడు తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి యుపిఐ చెల్లింపులు చేయవచ్చని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది. ఎన్ఆర్ఐ లు ఇప్పుడు బ్యాంక్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తో తమ ఎన్ఆర్ఈ లేదా ఎన్ఆర్ఓ ఖాతాల నుండి వాస్తవ సమయంలో యుపిఐ చెల్లింపులను ఎలాంటి చార్జీలను చెల్లించకుండా చేయవచ్చు. అదనంగా, వారు తమ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఖాతాలను ఇతర యుపిఐ -ఆధారిత అప్లికేషన్‌లకు లింక్ చేసే సౌలభ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ సౌకర్యం ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, హాంకాంగ్, మలేషియా, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సింగపూర్, యుఏఈ , యుకె మరియు యుఎస్ఏ వంటి 12 దేశాల నుండి వచ్చిన అన్ని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎన్ఆర్ఐ కస్టమర్లకు భారతదేశంలో రూపాయలలో లావాదేవీల కోసం అందుబాటులో ఉంది.
ఈ కొత్త ఫీచర్‌తో, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎన్ఆర్ఐ ల కోసం దాని డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లో యుపిఐ చెల్లింపులను సజావుగా అనుసంధానించింది, ఇది సౌలభ్యం , అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇప్పుడు క్యుఆర్ కోడ్‌లు, యుపిఐ ఐడి లు లేదా మొబైల్ నంబర్‌లను ఉపయోగించి తక్షణమే డబ్బు పంపవచ్చు , స్వీకరించవచ్చు. దీని వలన బ్యాంక్ తన ఎన్ఆర్ఐ కస్టమర్‌లు దేశీయ కస్టమర్‌ల మాదిరిగానే సులభంగా , సురక్షితంగా వారి ఆర్థిక నిర్వహణకు అవకాశం ఇస్తుంది.
కీలక ప్రయోజనాలు:
* భారతీయ సిమ్ అవసరం లేదు: ఎన్ఆర్ఈ /ఎన్ఆర్ఓ ఖాతాతో లింక్ చేయబడిన మీ అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
* తక్షణ లావాదేవీలు: క్యుఆర్ కోడ్‌లు/యుపిఐ ఐడి లు /మొబైల్ నంబర్‌ను ఉపయోగించి డబ్బు పంపండి & స్వీకరించండి లేదా బిల్లులు చెల్లించచవచ్చు .
* సున్నా లావాదేవీ రుసుములు: ఎటువంటి ఛార్జీలు లేకుండా యుపిఐ చెల్లింపులను ఆస్వాదించచవచ్చు .
* సురక్షితమైనది మరియు విశ్వసనీయమైనది: దేశీయ యుపిఐ వలె అదే స్థాయి భద్రతా ప్రమాణాలను ఆస్వాదించవచ్చు.
రిటైల్ లయబిలిటీస్ హెడ్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ “మా కస్టమర్‌లు ఎక్కడ ఉన్నా బ్యాంకింగ్‌ను సులభతరం చేయడం, మెరుగుపరచడం, దానిని అందుబాటులో ఉంచడం పైనే ఎల్లప్పుడూ మా దృష్టి ఉంటుంది. అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ల పై యుపిఐ సేవలను ప్రారంభించడం అనేది ఆవిష్కరణ పట్ల మా నిబద్ధతకు , ఎన్ఆర్ఐ జనాభా యొక్క ప్రత్యేక అవసరాలను తీర్చాలనే ప్రయత్నాలకు నిదర్శనం” అని అన్నారు.
భారతదేశంలోని లావాదేవీల కోసం చెల్లింపులు చేసేటట్లు అయితే, ఎన్ఆర్ఐ లు విదేశాలలో ఉన్నప్పుడు కూడా యుపిఐ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు. అటువంటి లావాదేవీలు ఎటువంటి విదేశీ మారకపు ఛార్జీలను ఆకర్షించవు.
యుపిఐ లావాదేవీలను ప్రారంభించడానికి మరియు చెల్లింపులు చేయడానికి 3 సులభమైన అడుగులు:
మొదటి దశ : ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ యాప్‌లోకి లాగిన్ అయి ‘పే ’ పై క్లిక్ చేయండి
రెండవ దశ : బ్యాంక్ ఖాతాను లింక్ చేయండి
మూడవ దశ : చెల్లింపు చేయడం ప్రారంభించడానికి యుపిఐ ఐడి ని సృష్టించండి.