న్యూఢిల్లీ: పాకిస్తాన్ మళ్లీ దాడి చేస్తే.. భారత్ ప్రతిస్పందన మరింత వినాశకరమైనదిగా, బలంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌తో చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలను తగ్గించే ఒప్పందంపై జరిగిన చర్చల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదివారం జెడి వాన్స్ ఫోన్ చేసి మాట్లాడారు.
పాకిస్తాన్ భారతదేశంపై దాడి చేస్తే, ఈసారి మరింత బలంగా దాడి చేస్తామని మోడీ చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాశ్మీర్‌పై భారత్ వైఖరి స్పష్టంగా ఉందని, పాకిస్తాన్ నుండి పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) తిరిగి తీసుకురావడం మాత్రమే మిగిలి ఉందని ప్రధాని తెలిపారు. భారత్-పాకిస్తాన్ మధ్య ఎవరూ మధ్యవర్తిత్వం వహించాలని మేం కోరుకోవడం లేదని.. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని చెప్పారు. పాకిస్తాన్ కాల్పులు జరపకపోతే, భారత్ కూడా సంయమనం పాటిస్తుందని ప్రధాని, జెడి వాన్స్ తో చెప్పినట్లు తెలుస్తోంది.