ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్ స్టార్, 8వ సీడ్ ఇగా స్వియాటెక్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో స్వియాటెక్ 60, 60 తేడాతో అమెరికాకు చెందిన 13వ సీడ్ అమందా అనిసిమోవాను చిత్తు చేసింది. ఇగా కెరీర్‌లో ఇది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. అమందాతో జరిగిన తుది పోరులో స్వియాటెక్ పూర్తి ఆధిపత్యం చెలాయించిది. తన మార్క్ షాట్లతో అలరించిన స్వియాటెక్ ఏ దశలోనూ అమందాకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ఇగా చెలరేగిఆడడంతో అమందా పూర్తిగా చేతులెత్తేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన ఇగా ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే తొలి సెట్‌ను దక్కించుకుంది. ఇగా ధాటికి అమందా ఎదురు నిలువలేక పోయింది. టాప్ సీడ్ సబలెంకతో జరిగిన సెమీ ఫైనల్లో అసాధారణ ఆటను కనబరిచిన అమందా తుది పోరులో మాత్రం పూర్తిగా తేలిపోయింది.
ఇగా ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది కళ్లు చెదిరే షాట్లతో అమందాను ఉక్కిరిబిక్కిరి చేసింది. రెండోసెట్‌లో కూడా స్వియాటెక్‌కు ఎదురు లేకుండా పోయింది. దూకుడుగా ఆడుతూ లక్షం వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఒక్క గేమ్ కూడా కోల్పోకుండానే రెండో సెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకుని వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో అమందాపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆరో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇక తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరిన అమందాకు నిరాశే మిగిలింది. ఇగా ధాటికి ఎదురు నిలువలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక స్వియాటెక్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ కావడం విశేషం. కొంత కాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతున్న ఇగాకు వింబుల్డన్ టైటిల్ కొత్త ఊపు ఇచ్చిందని చెప్పాలి.