Friday, September 5, 2025

వరుసగా ఏడోసారి టాప్‌లో మద్రాస్ ఐఐటీ

- Advertisement -
- Advertisement -

నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ 2025ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ విడుదల చేశారు. ద ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ ఈ ఏడాది కూడా పలు ర్యాంకులు సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్’ కేటగిరీలో వరుసగా ఏడోసారి టాప్ ర్యాంక్ దక్కగా.. ఇంజినీరింగ్ విభాగంలో వరుసగా 10వ ఏడాది తొలి స్థానం సంపాదించుకున్నట్లు విద్యాసంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆవిష్కరణల విభాగంలో గతేడాది రెండో స్థానం రాగా.. ఇప్పుడు నంబర్ వన్ స్థానం దక్కించుకొంది. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కేటగిరీలోనూ ఐఐటీ మద్రాస్ పైచేయి సాధించింది.

ఓవరాల్ కేటగిరీలో టాప్ విద్యాసంస్థలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పుర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్పుర్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఢిల్లీ
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి

టాప్ 10 యూనివర్సిటీలు

ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
జామియా మిలియా ఇస్లామియా, న్యూదిల్లీ
ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూఢిల్లీ
బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ
అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్
జాదవ్పుర్ విశ్వవిద్యాలయం, కోలకత్తా
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీగఢ్

టాప్ 5 కళాశాలలు

హిందూ కళాశాల, ఢిల్లీ
మిరాండా హౌస్, ఢిల్లీ
హన్స్ రాజ్ కళాశాల, ఢిల్లీ
కిరోడి మాల్ కళాశాల, ఢిల్లీ
సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, ఢిల్లీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News