Saturday, June 28, 2025

మరోసారి తల్లైన ఇలియానా.. బిడ్డకు ఏం పేరు పెట్టారంటే..

- Advertisement -
- Advertisement -

నటి ఇలియానా (Ileana D’Cruz) ఆమె ఫ్యాన్స్‌కి శుభవార్త అందించారు. ఆమె మరోసారి తల్లి అయినట్లు ఆమె వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తన కుమారుడి ఫోటోని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఇలియానా.. ఆ బుబ్జాయికి ‘కియాను రఫే డోలాన్’ అని పేరు పెట్టామని.. అతన్ని పరిచయం చేస్తున్నందుకు తమ హృదయాలు ఆనందంతో నిండిపోయాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇలియానాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగారు ఇలియానా (Ileana D’Cruz). ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. 2018లో చివరిసారిగా తెలుగులో రవితేజతో కలిసి ‘అమర్ అక్బర్ ఆంటొనీ’ అనే చిత్రంలో నటించారు. ఇక పోతే బాలీవుడ్‌లో 2024లో ‘దో ఔర్ దో ప్యార్’ అనే సినిమాలో ఆమె నటించారు. ‘రైడ్-2’ సినిమాలో ఆమెకు అవకాశం వచ్చినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమాను వదిలేసుకున్నారు. 2023లో మైఖేల్ డోలన్‌ను ఇలియానా ప్రైవేటుగా వివాహం చేసుకున్నారు. అదే ఏడాది ఆగస్టులో మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ పిల్లాడికి ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అని పేరు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News