- Advertisement -
హైదరాబాద్: అల్వాల్ చిన రాయుని చెరువులో అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఎఫ్ టిఎల్ పరిధిలో భవన నిర్మాణాల పై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మూడు భవన నిర్మాణాలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. నిర్మాణాలను కూల్చివేసే సమయంలో నిర్మాణదారులకు హైడ్రా అధికారులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.
- Advertisement -