- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రక్షణశాఖ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్త్ తో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటోన్మెంట్ భూములలో కొన్ని సంవత్సరాల నుంచి దుకాణాలు, టిఫిన్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. రక్షణ శాఖ భూములను ఆక్రమించుకొని టిఫిన్ సెంటర్లను ఏర్పాటు చేయడమనేది చట్ట విరుద్ధం. వెంటనే ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినప్పటికి దుకాణాదారులు ఖాళీ చేయలేదు. దీంతో కంటోన్మెంట్ బోర్డు అధికారులు జెసిబిలతో టిఫిన్ సెంటర్లు, స్టాల్స్‌ను కూల్చివేశారు. కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ శాఖకు భూములలో రేకుల షెడ్డులు కూడా ఉన్నాయి, వాటిని కూడా అధికారులు తొలగిస్తున్నారు.
- Advertisement -