ఆక్రమణల కూల్చివేత… బస్సులను ఖాళీ చేయించిన అధికారులు
మన తెలంగాణ కథనంతో కదిలిన యంత్రాంగం
రంగంలోకి హైడ్రా, డిఆర్‌ఎఫ్, జిహెచ్‌ఎంసి, రెవెన్యూ సిబ్బంది
భారీ బందోబస్తు మధ్య చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా మార్చురీ వరకు ఆక్రమణల తొలగింపు
మన తెలంగాణ/గోషామహల్: మూసీలో అక్రమార్కులపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మం గళవారం తెల్లవారుజామున 5 గంటలకే హైడ్రా, డిఆర్‌ఎఫ్, జిహెచ్‌ఎంసి, రెవెన్యూ అధికారుల బృందం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి అఫ్జల్‌గంజ్ మూసీ లో అక్రమంగా వెలసిన ఆక్రమణలు నేలమట్టం చేశా రు. మనతెలంగాణ దినపత్రికలో ఆదివారం “మూసీని మూసేస్తున్నారు” శీర్షికన ప్రచురితమైన వార్తా కథనం తో స్పందించిన అధికార యంత్రాంగం కదిలింది. తెల్లవారు జామున 5 గంటలకే సంఘటనా స్థలానికి చేరుకున్న హైడ్రా, జిహెచ్‌ఎంసి, రెవెన్యూ అధికారు బృం దం అఫ్జల్‌గంజ్ మూసీ గ ర్భంలో ఆక్రమణలు తొలగించారు. గత 2 దశాబ్దాలుగా మూసీలో నీరు పారకుండా మట్టి పోసి, పూడ్చివేసి అక్రమంగా నిర్వహిస్తున్న వ్యాపారా లు తొలగించారు.
కబ్జాదారులు ఏర్పాటు చేసిన ఇనుప గేట్లను తొలగిం చి, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మూసీని కబ్జా చేసిన అక్రమార్కులపై హైడ్రా కొరడా ఝలిపించడం పట్ల స్థానికులు, పరిసర ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్ మూసీ గర్భంలో కొందరు అ క్రమార్కులు మూసీ నదిలో సుమారు 20 అడుగుల లో తు వరకు మట్టి పోసి, మూసీని పూడ్చివేసి అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. మట్టి పోసి, చదును చేసిన మూసీ స్థలంలో కబ్జాదారులు అక్రమంగా సుమారు 100 గుడిసెలు ఏర్పాటు చేసి, వారి నుండి ప్రతి నెలా అద్దె వసూలు చేస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా పలు షెడ్లను నిర్మించి, లాజిస్టిక్, నర్సరీ, స్క్రాప్ తదితర వ్యాపారాలకు అద్దె వసూలు చే స్తుండటంతో పాటు ప్రైవేట్ బస్సులు, లారీల పార్కింగ్ కోసం అద్దెకు ఇచ్చి వ్యాపారం చేస్తున్నారు. గతంలోనూ మూసీలో ఆక్రమణలపై స్థానికులు ఫి ర్యాదు చేసినా అధికారులు రాజకీయ వత్తిళ్ల కారణంగా నామ మాత్రంగా తొలగించి చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలున్నాయి.
కబ్జాకుగురైన పదెకరాల స్థలం స్వాధీనం
మూసీలో కబ్జాకు గురైన స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సుమారు 10 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. తికారం సింగ్ అనే వ్యక్తి మూసీలో 3.10 ఎకరాల స్థలాన్ని ఆక్రమించగా, జై కిషన్ 5.22 ఎకరాలను, పూనమ్‌చంద్ యాదవ్ 1.30 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి, అక్రమంగా వ్యాపారాలు నిర్వహిస్తూ, రెండు చేతులా ఆర్జిస్తుస్తున్నారు. “మన తెలంగాణ” దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనం ద్వారా వెలుగులోకి తేవడంతో స్పందించిన అధికార యంత్రాంగం గత 20 సంవత్సరాలుగా మూసీలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఆ క్రమణలు నేలమట్టం చేశారు. తెల్లవారు జామున 5గంటల నుంచే హైడ్రా అధికారులు రెవెన్యూ, పోలీస్, జిహెచ్‌ఎంసి, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బ ందితో కలిసి మూసీలో ఆక్రమణలు నేలమట్టం చేసి, ప్రహరీ చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి, మూసీలో కబ్జాకు గురైన సుమారు 10 ఎకరాల స్థలాన్ని స్వాధీ నం చేసుకున్నారు.
హైడ్రా చర్యల పట్ల హర్షం…
మూసీలో ఆక్రమణలను హైడ్రా అధికారులు నేలమట్టం చేయడం పట్ల గోషామహల్ డెవలప్‌మెంట్ ఫోరం కన్వీన ర్, సీనియర్ కాంగ్రెస్ నేత బద్దం సతీష్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పురానాపూల్ నుండి చాదర్‌ఘాట్ బ్రిడ్జి వరకు కొందరు అక్రమార్కులు మూసీలో మట్టి పోసి, పూడ్చి, చదును చేసి అక్రమంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మన తెలంగాణ పత్రికలో వచ్చిన వార్తా కథనంతో జిల్లా కలెక్ట ర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో స్పందించి హైడ్రా అధికారులు మంగళవారం తెల్లవారు జామున వివిధ శాఖల అధికారులతో సంఘటనా స్థలానికి చేరుకుని, గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఆక్రమణలను తొలగించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని బద్దం సతీష్‌గౌడ్, ప్రజా ఏక్తా పార్టీ జాతీయ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్‌లు పేర్కొన్నారు. మూసీలో ఆక్రమణలు తొలగింపు హర్షనీయమే కానీ ఫెన్సింగ్ చేసి వదిలేస్తే ఎలాంటి ప్రయోజనం లేదని, మూసీలో అక్రమార్కులు పోసిన మట్టిని తొలగించడం వల్ల భారీ వర్షాలు కురిసినా మూసీ ప్రవాహం సాఫీగా వెళ్లిపోతుందని అన్నారు.
లేని పక్షంలో మళ్లీ అక్రమార్కులు ఫెన్సింగ్ తొలగించి ఆక్రమణలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మూసీకి శాశ్వత రక్షణ కల్పించాలంటే మూసీ నదిలో 20 అడుగుల లోతు వరకు పోసిన మట్టిని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.