Monday, July 14, 2025

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధిః మహారాష్ట్ర నుండి అక్రమంగా తరళిస్తున్న మద్యంను వాంకిడి పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఎస్‌ఐ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని అర్‌టిఎ చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ ప్రశాంత్ అధ్వర్యంలో వాహానాల తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట్ర వైపు నుండి అనుమానస్పదంగా వస్తున్న కారును తనిఖీ చేశారు. కాగా ఆ కారులో మహారాష్ట్రను చెందిన మద్యం లభ్యం అయింది. 72 రాయల్ స్టాగ్ ఫుల్ బాటిళ్లు, రెండు వేల ఓసి 90 ఎంఎల్ బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ. 14 లక్షలు ఉంటుందని తెలిపారు. మద్యం తరళిస్తున్న మహారాష్ట్ర,, గడ్‌చాందూర్‌కు చెందిన సుదర్శన్, రాజేంద్ర పాపయ్యలను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News