మన తెలంగాణ/తానూర్: నిర్మల్ జిల్లా తానూర్ మండలం బోరిగాం గ్రామ బాలాజీ గుట్ట సమీపంలో గల ఎల్వి శివారులోని ప్రభుత్వ భూమి సర్వే నెంబరు 266 లో అక్రమంగా మొర్రం మట్టి తవ్వకాలు చేస్తున్న ఒక జేసీబీని, మూడు ట్రాక్టర్లను పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఆర్‌ఐ నరేష్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వుతూ , ట్రాక్టర్ల సహాయంతో తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని అక్రమ తవ్వకాలకు ఉపయోగించి జేసీబీ అలాగే మట్టిని తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని తహసీల్దార్ సూచించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలపై అందిన పక్కా సమాచారం మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ వాహనాలను తదుపరి విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బోరిగాం బాలాజీ గుట్ట వద్ద అక్రమ తవ్వకాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -