Thursday, July 3, 2025

గోటూర్ వాగు నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ధన్వాడ: ధన్వాడ మండలం గోటూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణాను కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రతి రోజు అధికార పార్టీ నాయకులు టిప్పర్లతోనే ఇసుకను రవాణ చేస్తున్నారు. కొందరు వాగునే గుత్త తీసుకున్నట్లుగా వాగులోనే ప్రత్యేకంగా ఎక్కడ పడితే అక్కడ ఇసుక డంపింగ్ ఏర్పాటు చేశారు. ఇసుక డంపింగ్ ఏర్పాటు చేసిన వాగు వద్దకు చక్కగా రోడ్డును సైతం ఏర్పాటు చేయడం విశేషం. గత కొన్ని రోజుల నుంచి ఇష్టానుసారంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నప్పటికి అధికారులు చూసి చూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గోటూర్ వాగు నుంచి కొండాపూర్ , మరికల్ , కిష్టాపూర్ , హన్మన్పల్లి, రాంకిష్టాయ్యపల్లితో పాటుగా అనేక గ్రామాలకు పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News