- Advertisement -
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ కేంద్రం వర్ష సూచన చేసింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండలు కొడతాయని.. సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, సిద్దిపేట, యాదాద్రి, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే చాన్స్ ఉందని పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
అటు, ఆంధ్రప్రదేశ్ లోనూ పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వానలు పడొచ్చని.. గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
- Advertisement -