వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్థాన్‌కు మరో ఝలక్ తగిలింది. పాకిస్థాన్‌కు నిధులు ఇచ్చే ఇంటర్‌నేషనల్ మానెటరి ఫండ్(IMF).. ఆ దేశానికి 11 కొత్త షరతులు విధించింది. తాజాగా విధించిన షరతులతో పాక్‌పై (Pakistan) ఐఎంఎఫ్ విధించిన షరతులన సంఖ్య 50కి చేరింది. ఇటీవల పాక్‌కు బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే కొన్ని షరతులను విధించింది.
2026 వార్షిక బడ్జెట్‌కు జూన్‌లోగా పార్లమెంట్ ఆమెదం తెలపాలని పేర్కొంది. ఆ తర్వాత నాలుగు ప్రావిన్సుల్లో వ్యవషాయ ఆదాయపన్ను చట్టాలు అమల్లోకి తేవాలని తెలిపింది. ఇంధన రంగంలో కొత్త నిబంధనలు విధించాలని.. 2026 ఫిబ్రవరి 15 నాటికి గ్యాస్ ఛార్జీలు సవరించాలని స్పష్టం చేసింది. విద్యుత్ యూనిట్‌పై రూ.3.21 పరిమితిని తొలగించాలంటూ షరతులు విధించింది ఐఎంఎఫ్. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు సమాచారం.