Thursday, May 22, 2025

విప్లవాత్మకమైన అభివృద్ధి పనులు చేసి చూపిస్తాం: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( kishan Reddy)తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తే, మాజీ సిఎం కెసిఆర్ కనీసం రాలేదని విమర్శించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విప్లవాత్మకమైన అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని అన్నారు. ఇప్పటికే చర్లపల్లి రైల్వేస్టేషన్ ను ప్రారంభించుకున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రోచ్ రోడ్ కు భూసేకరణ పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంత వేగంగా సహకరిస్తే, అంతకంటే వేగంగా కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News