Monday, May 5, 2025

ఇమ్రాన్, బిలావల్ , స్టార్ల ఎక్స్ వేదికలకు బ్రేక్

- Advertisement -
- Advertisement -

పహల్గాం దాడుల తరువాత భారత్ చర్య
న్యూఢిల్లీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్, మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోల ఎక్స్ సామాజిక భారతదేశం స్తంభింపచేసింది. ఈ నిర్ణయాన్ని ఆదివార అధికారికంగా ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడుల తరువాతి దశలో భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేఫథ్యంలోనే భారత్ ఈ చర్యకు దిగింది. చట్టపరమైన చర్యలలో భాగంగానే వీరి ఖాతాలను నిషేధించారు. ఇప్పుడు వీరి ఎక్స్ అకౌంట్లపై ఉండే ఫోటోలు అన్నింటిని తొలిగించారు. అంతకు ముందు రోజు పాకిస్థాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి అటాయుల్లా తరార్ ఎక్స్ అకౌంట్‌ను కూడా నిలిపివేశారు.

పాకిస్థాన్‌పై భారత్ ఏ క్షణంలో అయినా ప్రత్యక్ష దాడులకు దిగుతుందని తరార్ వ్యాఖ్యానించారు. భారత్‌పై పాకిస్థాన్‌కు చెందిన పలువురు నేతలు , సామాజిక కార్యకర్తలు పలు విధాలుగా తమ సామాజిక మాధ్యమాల ద్వారా విద్వేషకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగుతున్న వైనాన్ని గుర్తించి వెంటనే తగు చర్యలకు భారత ప్రభుత్వం దిగుతోంది. ఇటీవలే పాకిస్థాన్ నటులు హనియా అమీర్, మహీరా ఖాన్‌ల ఎక్స్ వేదికలను కూడా భారత్ నిషేధించింది. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో స్పందనలను పరిశీలిస్తూ అనుచితమైన వాటిని తొలిగించడం తరువాత ఆయా ఖాతాలను స్తంభింపచేయడం జరుగుతోంది. పాకిస్థాన్‌కు చెందిన నటులు ఫవాద్ ఖాన్, అఫిఫ్ అస్లం, మావ్రా హోకనే ఖాతాలను కూడా బ్లాక్‌లిస్టులో చేర్చారు. ఇక నిషేధిత ఖాతాల జాబితాలోకి చేరిన వ్యక్తుల సామాజిక ఖాతాలు , వారి స్పందనలు భారతదేశంలో కన్పించకుండా పోతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News