Saturday, July 26, 2025

కోడలిని లక్ష రూపాయలకు అమ్మేసిన అత్తమామలు

- Advertisement -
- Advertisement -

ముంబయి: అత్తామామలు కోడలిని లక్ష రూపాయలకు అమ్మేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో ఓ మహిళ భర్త, అత్తమామలతో కలిసి ఉండేది. భర్త చనిపోవడంతో అత్తమామతో కలిసి కోడలు ఉంటుంది. అత్తమామలు కోడలిని గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తికి రూ1.25 లక్షలకు అమ్మేశాడు. అతడు రెండు సంవత్సరాలు శారీరకంగా, మానసికంగా వాడుకొని, ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత అత్తమామల వద్ద వదిలి వెళ్లిపోయాడు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News