Sunday, May 11, 2025

సిబిఐ వలలో ఆదాయపన్ను శాఖ కమిషనర్

- Advertisement -
- Advertisement -

ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు లంచం తీసుకుంటుండగా హైదరాబాద్ ఆదాయపన్ను శాఖ కమిషనర్ జీవన్‌లాల్ లావిడియాను సిబిఐ అధికారులు ముంబాయిలో శనివారం అరెస్టు చేశారు. ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు జీవన్‌లాల్ లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. దీంతో కంపెనీ ప్రతినిధులు ఇచ్చేందుకు అంగీకరించడంతో మధ్యవర్తి ద్వారా రూ.70లక్షలు తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మధ్యవర్తి, జీవన్‌లాల్‌ను అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు విచారించగా ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి వచ్చాయి.

దీంతో సిబిఐ అధికారులు ముంబాయి, హైదరాబాద్, ఖమ్మం, విశాఖపట్టణం, ఢిల్లీతోపాటు 18 ప్రాంతాల్లో సోదాలు చేశారు. సోదాల్లో సిబిఐ అధికారులు రూ.69లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జీవన్‌లాల్, సాయిరామ్ పలిశెట్టి, నట్టా వీరనాగ శ్రీరామ్‌గోపాల్, కాంతిలాల్ మోహతా, సజిదా మజహర్ హుస్సేన్‌షాను అరెస్టు చేశారు. ముంబాయిలోని సిబిఐ కోర్టు స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపర్చారు. కోర్టు ఐదుగురికి రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. మాజీ ఎమ్మెల్యే కూమారుడైన జీవన్‌లాల్ 2004లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాడు. హైదరాబాద్ ఆదాయ పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News