- Advertisement -
సరైన ఆహారం లభించినప్పుడే విద్యార్థులు చదువులపైన దృష్టి కేంద్రీకరించగలరు..ఆ అవసరాన్ని గుర్తించిన ప్రజా ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచింది. 3వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.950గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.1,330కి, 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల డైట్ ఛార్జీలను రూ.1,100 నుంచి రూ.1,540, ఇంటర్మీడియట్ నుంచి పిజి వరకు విద్యార్థులకు రూ.1,500గా ఉన్న డైట్ ఛార్జీలను రూ.2,100కి రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే 3వ తరగతి నుంచి ఏడో తరగతి వరకు విద్యార్థులకు గతంలో కాస్మోటిక్ ఛార్జీలు రూ.55 ఉండగా వాటిని రూ.175, 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు రూ.75గా ఉన్న కాస్మోటిక్ ఛార్జీలను రూ.275కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఇది రాష్ట్రంలో హాస్టళ్లలో ఉన్న 7,65,700 మంది విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలిగించింది.
- Advertisement -