బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగనున్న రెం డో టెస్టు (Ind vs Eng 2nd Test) టీమిండియాకు సవాల్‌గా మారింది. లీడ్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ అనూహ్య ఓటమి పాలైన సంగతి తెలిసిందే. రెండు ఇన్నింగ్స్‌లలోనూ భారీ స్కోర్లు సాధించినా జట్టుకు ఓటమి తప్ప లేదు. ఇలాంటి పరిస్థితుల్లో బుధవారం నుంచి జరిగే రెండో టెస్టు మ్యాచ్ భారత్‌కు పరీక్షగా తయారైంది. తీవ్ర ఒత్తిడి నెలకొన్న స్థితిలో మ్యాచ్ బరిలో దిగుతున్న టీమిండియా (Ind vs Eng 2nd Test) పటిష్టమైన ఇంగ్లండ్‌కు ఏ మేరకు పోటీ ఇస్తుందనేది సందేహంగా మారింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
తొలి టెస్టు ఓటమి నేపథ్యంలో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీన్ని తట్టుకుని ముందుకు సాగడం అనుకున్నంత తేలిక కాదని చెప్పాలి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్ భారత్‌కు ప్రధాన సమస్యగా మారనుంది. తొలి టెస్టులో ఓటమికి బౌలింగ్ వైఫల్యం ప్రధాన కారణంగా మారిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లోనైనా బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేస్తారా లేదా అనేది కలవరానికి గురి చేస్తోంది. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను బరిలోకి దిగుతాడా లేదా అనేది దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అజారుద్దీన్‌తో సహా పలువురు మాజీ క్రికెటర్లు సయితం కుల్దీప్‌ను ఆడించాలని సూచిస్తున్నారు. రవీంద్ర జడేజాతో కలిసి అతను స్పిన్ భారాన్ని మోసే అవకాశం ఉంది.
ఇక బ్యాటిం గ్‌లో టీమిండియా బలంగానే ఉంది. తొలి టెస్టులో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, సీనియర్ ఆటగాడు కెఎల్ రాహుల్‌లు సెంచరీలతో రాణించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా వీరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణిస్తే ఇంగ్లండ్‌కు గట్టి పోటీ ఇచ్చే అవకా శాలుంటాయి. ఈ పరిస్థితుల్లో అందరి ఆశలు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, ఓపెనర్ యశస్వి, సీనియర్‌ఆటగాడు రాహు లపై నిలిచాయి. హైదరాబాదీ సిరాజ్ కూడా తన స్థాయికి తగ్గ ప్రద ర్శన చేయక తప్పదు. అప్పుడే జట్టు కష్టాల్లో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. లేకుంటే బర్మింగ్‌హామ్‌లోనూ ఓటమి ఖాయమని చెప్పక తప్పదు.