నేటి నుంచి లార్డ్‌లో ఇంగ్లండ్‌తో మూడో టెస్టు
లండన్: ఇంగ్లండ్‌తో గురువారం చారిత్రాక లార్డ్ మైదానంలో ప్రారంభమయ్యే మూడో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్టులో రికార్డు విజయాన్ని అందుకున్న భారత్ ఈ మ్యాచ్‌లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. ఇక ఇంగ్లండ్ ఇప్పటికే మూడో టెస్టు కోసం తుది జట్టును ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఆర్చర్ ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. టీమిండియాలో ఒక మార్పు జరిగే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణను తప్పించి అతని స్థానంలో సాయి సుదర్శన్‌ను ఆడించే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి.
శుభారంభం అందించాలి..
సిరీస్‌లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కెఎ ల్ రాహుల్‌లు నిలకడైన బ్యాటింగ్‌ను కనబరుస్తున్నారు. ఇద్దరు ఇప్పటికే సెంచరీలతో అలరించారు. ఈ మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందించాలని భావిస్తున్నారు. కిందటి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి, రెం డో ఇన్నింగ్స్‌లో రాహుల్‌లు సత్తా చాటారు. ఈసారి కూడా నిలకడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు.
గిల్ జోరు సాగాలి..
తొలి రెండు టెస్టుల్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ లార్డ్ పోరుకు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఇప్పటికే రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీతో గిల్ మెరుపులు మెరిపించాడు. లార్డ్‌లోనూ చెలరేగాలనే పట్టుదలతో ఉన్నా డు. గిల్ అద్భుత ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తిస్తున్న గిల్ మరోసారి బ్యాట్‌ను ఝులిపించేందుకు సిద్ధమయ్యాడు. గిల్ సత్తా చాటితే టీమిండియాకు ఈసారి కూడా భారీ స్కోరు ఖాయం. జట్టును ముం దుండి నడిపిస్తున్న గిల్ లార్డ్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. అతని బ్యాటింగ్ విన్యాసాలను చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ కూడా జోరు మీదున్నాడు. సిరీస్‌లో పంత్ ఇప్పటికే రెండు సెంచరీలు నమోదు చేశాడు.
కిందటి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. రవీంద్ర జడేజా కూడా రెండు టెస్టుల్లోనూ నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఈసారి కూ డా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ రూపంలో మరో మెరుగైన బ్యాటింగ్ అస్త్రం ఉండనే ఉంది. అయితే కరుణ్ నాయర్ వైఫల్యం జట్టు ను కలవరానికి గురి చేస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా నా యర్ మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచక తప్పదు. మరోవైపు కిందటి మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో టీమిండి యా విజయంలో కీలక పాత్ర పోషించిన బౌలర్లు ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్‌లపై జట్టు మరోసారి భారీ ఆశ లు పెట్టుకుంది.
సిరాజ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల తో సత్తా చాటాడు. ఆకాశ్‌దీప్ నాలుగు వికెట్లు పడగొట్టి తనవంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్‌దీప్ ఏకంగా ఆరు వికెట్లను తీసి పెను ప్రకంపనలు సృష్టించాడు. ఈసారి కూడా వీరిద్దరిపై జట్టు భారీ ఆశ లు పెట్టుకుంది. సీనియర్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా కూ డా తుది జట్టులోకి వస్తే బౌలింగ్ మరింత బలోపేతంగా మారుతుంది. రెండు విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న భారత్ ఈ మ్యాచ్‌లో పేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
సవాల్ వంటిదే..
మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ టీమ్‌కు ఈ మ్యాచ్ సవాల్‌గా మారింది. రెండో టెస్టులో ఘోర పరాజయం పా లు కావడంతో జట్టు ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఇలా ంటి స్థితిలో టీమిండియాను ఓడించడం అనుకున్నంత తేలికకాదనే చెప్పాలి. ఓపెనర్లు జాక్ క్రాలి, బెన్ డకెట్‌లు జోరుమీదున్నారు. ఓలి పోప్, జో రూట్‌లు కూడా ఫామ్‌లోనే ఉన్నారు. హ్యారీ బ్రూక్, వికెట్ కీపర్ జేమీ స్మిత్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈసారి కూడా స్మిత్, బ్రూక్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. జోఫ్రా ఆర్చర్ చేరికతో ఇంగ్లండ్ బౌలింగ్ బలోపేతంగా తయారైంది. సొంత గడ్డపై ఆడుతుండడం ఇంగ్లండ్ టీమ్‌ను సానుకూల పరిణామంగా చెప్పాలి.