ENG vs IND: ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా గురువారం భారత్-ఇంగ్లాండ్ జట్ల మద్య లార్డ్స్ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నితీశ్ కుమార్ రెడ్డి తన తొలి ఓవర్ లోనే.. ఇంగ్లాండ్ ను దెబ్బ కొట్టాడు. ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. నితీశ్ వేసిన 14 ఓవర్‌లో మూడో బంతికి బెన్ డకెట్(23)ను.. చివరి బంతికి జాక్ క్రాలీ(18)ని పెవిలియన్ పంపించాడు. దీంతో ఇంగ్లాండ్ 14 ఓవర్లలో 44 పరుగలకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(24), ఓలీ పోప్(12)లు ఉన్నారు.