- Advertisement -
ENG vs IND: లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. నాలుగో రోజు చివరి సెషన్ లో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆదిలోనే బిగ్ షాక తగిలింది. రెండో ఓవర్ లోనే ఓపెనర్ జైస్వాల్ ను అర్చర్ డకౌట్ చేయగా.. 13, 15 వరుస ఓవర్లలో బ్రైడన్ కార్స్.. కరణ్ నాయర్(14), కెప్టెన్ గిల్(06)లను పెవిలియన్ కు పంపించాడు. దీంతో ఒత్తిడిలో పడిన భారత్ నెమ్మెదిగా బ్యాటింగ్ చేస్తోంది. ప్రస్తుతం టీమిండియా 17 ఓవర్లో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో కెఎల్ రాహుల్(), ఆకాశ్ దీప్()లు ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 135 పరుగులు కావాలి.
- Advertisement -