భారత్ 427/6 డిక్లేర్డ్
ఇంగ్లండ్ లక్షం 608.. ప్రస్తుతం 72/3
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెం డో టెస్టులో టీమిండియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. ఆతిథ్య టీమ్ ఇంగ్లండ్ ముందు క్లిష్టమైన 608 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శనివారం నాలుగో రోజు 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో తిరిగి బ్యాటింగ్ చేపట్టిన టీమిండి యా 6 వికెట్ల నష్టానికి 427 పరుగులు సాధిం చి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్‌ను నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 180 పరుగుల ఆధిక్యం సాధించిన సంగతి తెలిసిందే. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి విధ్వంసక బ్యా టింగ్‌తో అలరించాడు.
రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలతో కలిసి శుభ్‌మన్ గిల్ కీలక పార్ట్‌నర్‌షిప్‌లను నమోదు చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించిన రాహుల్, పంత్‌లు అర్ధ సెంచరీలతో అలరించారు. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కరుణ్ నాయర్ (26) మరోసారి నిరాశ పరిచాడు. అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచిన రాహుల్ 10 ఫోర్లతో 55 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగిన పంత్ 58 బంతుల్లోనే 3 సిక్స్‌లు, 8 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 110 పరుగుల జోడించాడు.
కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న శుభ్‌మన్ గిల్ 162 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 13 బౌండరీలతో 161 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో గిల్ 269 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక భారత్ తరఫున ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ 430 పరుగులు సాధించి గవాస్కర్ పేరిట ఉన్న (344) పరుగుల రికార్డును తిరగరాశాడు. ఇక జడేజా 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఇంగ్లండ్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది.