Thursday, September 18, 2025

రసవత్తరంగా ఐదో టెస్టు.. గెలుపు ముంగిట ఇరు జట్లు

- Advertisement -
- Advertisement -

లండన్(ఓవల్): ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-భారత్ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ఉత్కంఠను తలపిస్తున్న ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లను ఊరిస్తోంది. నాలుగో రోజు ఆట అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేసింది. తొలి సెషన్‌లో టీమిండియా పైచేయి సాధిస్తే.. రెండో సెషన్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపింది. ఆఖరి సెషన్‌లో పుంజుకున్న భారత్.. ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిర్ణీత సమయానికి ముందే నిలలిపి వేయాల్సి వచ్చింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. క్రీజులో జెమీ ఓవర్టన్(0 నాటౌట్), జెమీ స్మిత్(2 నాటౌట్) ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. భారత్‌కు నాలుగు వికెట్లు కావాలి. గాయంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయని క్రిస్ వోక్స్.. అవసరమైతే రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు సిద్దమయ్యాడు. గాయంతోనే బ్యాటింగ్ వచ్చేందుకు జెర్సీ వేసుకొని రెడీగా కనిపించాడు. దాంతో టీమిండియా విజయం సాధించాలంటే నాలుగు వికెట్లు పడగొట్టాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News