Thursday, July 31, 2025

టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టె స్టు మ్యాచ్‌ను డ్రాగా ముగించిన టీమిండి యా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గురువారం నుంచి కింగ్‌స్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే ఐదో, చివరి టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగేందు కు భారత్ సిద్ధమైంది. ఓటమి కోరల్లో చి క్కుకున్న టీమిండియా అసాధారణ బ్యా టింగ్ వల్ల నాలుగో టెస్టును డ్రాగా ము గించింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో జట్టు సిరీస్ అవకాశాలు సమంగా ఉన్నా యి. చివరి టెస్టులో గెలిచి సిరీస్‌ను స మం చేయాలని టీమిండియా తహతహలాడుతోంది. ఓల్డ్‌ట్రాఫర్డ్ టెస్టులో భారత్ చిరస్మరణీయ పోరాటంతో మ్యాచ్‌ను డ్రా గా ముగించింది.

నాలుగో రోజే ఓటమి ఖాయమని భావించిన దశ నుంచి మ్యా చ్‌ను డ్రా చేసి టీమిండియా ఔరా అనిపించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ బ్యాటర్ కెఎల్ రాహుల్‌లతో పాటు ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు ఈ మ్యాచ్‌లో చారిత్రక ఇన్నింగ్స్‌లతో జట్టును ఓటమి నుంచి రక్షించా రు. భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా ఖాతా తెరవకుండానే రెండు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ దశలో టీమిండియాకు ఇన్నిం గ్స్ ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ కెప్టెన్ గిల్, సీనియర్ ఆటగా డు రాహుల్ అసాధారణ పోరాట పటిమ తో జట్టును కష్టాల్లో నుంచి గట్టెక్కించా రు. ఇద్దరు ఆతిథ్య జట్టు బౌలర్లను దీటు గా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫ లించలేదు.

రాహుల్, గిల్‌లు కనబరిచిన పోరాట పటిమ భారత టెస్టు క్రికెట్ చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పాలి. తీవ్ర ఒత్తిడిలోనూ రాహుల్, గిల్‌లు అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్, రాహుల్‌లు అందించిన స్ఫూర్తితో ఆల్‌రౌండర్లు జడేజా, సుందర్‌లు పోరాటాన్ని కొనసాగించారు. ఇద్దరు చివరి రోజు చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును కష్టాల నుంచి బయటపడేశారు. ఈ జోడీని విడగొట్టేందుకు ఇంగ్లండ్ బౌలర్లు చేసిన ప్రయత్నాలను వీరు సమర్థంగా అడ్డుకున్నారు. సుందర్, జడేజాలు అజేయ శతకాలతో మ్యాచ్‌ను డ్రాగా ముగించారు. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావించిన ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. మ్యాచ్ డ్రాగా ముగిసినా టీమిండియా నైతిక విజయం సాధించిందనే చెప్పాలి. దీంతో రానున్న చివరి టెస్టుకు భారత్ సమరోత్సాహంతో సిద్ధమవుతోంది. కీలక ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News