ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సూపర్ శతకం సాధించాడు. తొలి ఇన్నింగ్స్ లో నిరాశపర్చిన జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్ లో కేవలం 127 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది, ఇంగ్లాండ్ పై జైస్వాల్ కు నాలుగో శతకం. మరో ఎండ్ లో కరణ్ నాయర్ జాగ్రత్తగా ఆడుతూ యశస్వీకి సహకారం అందిస్తున్నాడు. దీంతో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. అంతకుముందు భారత పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా రాణించాడు. కెరీర్ లో తొలి అర్థశతకాన్ని నమోదు చేశాడు. అంతేకాదు.. జైస్వాల్ తో కలిసి మూడో వికెట్ కు శతకం భాగస్వామ్యాన్ని అందించాడు. ప్రస్తుతం భారత్ 4 వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. క్రీజులో కరణ్ నాయర్(12), జైస్వాల్ (104) ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 201 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాగా, తొలి ఇన్నింగ్స్ లో భారత్ 224 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటైంది.
జైస్వాల్ సూపర్ సెంచరీ.. భారత్ ఆధిక్యం ఎంతంటే?
- Advertisement -
- Advertisement -
- Advertisement -