Wednesday, July 23, 2025

టీమిండియాకు చావోరేవో

- Advertisement -
- Advertisement -

సిరీస్‌పై ఇంగ్లండ్ కన్ను నేటి నుంచి నాలుగో టెస్టు

మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో ఓల్డ్‌ట్రాఫర్డ్ వేదికగా బుధవారం నుంచి జరుగనున్న నాలుగో టెస్టు (Ind vs Eng Fourth Test) మ్యాచ్ టీమిండియాకు చావోరేవోగా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి టీమిండియాకు నెలకొంది. కీలక ఆటగాళ్లు గా యం బారిన పడడం భారత్‌కు ప్రతికూలంగా మారిం ది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఆతిథ్య ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. లార్డ్‌లో గెలవడంతో ఇంగ్లీస్ టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

ఓపెనర్లే కీలకం..

ఈ మ్యాచ్‌లో టీమిండియాకు ఓపెనర్లు కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు కీలకంగా మారారు. జట్టుకు శుభారంభం అందించాల్సిన అవసరం వీరిపై ఎంతైనా ఉంది. యశస్వి మూడో టెస్టులో నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ విఫలమయ్యాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. ఈ మ్యాచ్‌లో యశస్వి తన బ్యాట్‌కు పని చెప్పక తప్పదు. రాహుల్ ఈ సిరీస్‌లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇది టీమిండియాకు (Ind vs Eng Fourth Test) ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. అయితే లార్డ్ మ్యాచ్ చివరి ఇ న్నింగ్స్‌లో రాహుల్ కీలక సమయంలో పెవిలియన్ చేరడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు. కీలకమైన నాలుగో టెస్టులో రాహుల్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.

గిల్ జోరు సాగాలి..

కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సిరీస్‌లో నిలకడైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. కానీ, మూడో టెస్టులో అతను విఫలం కావ డం జట్టుపై బాగానే ప్రభావం చూపింది. అతని వైఫల్యం తో జట్టుకు బ్యాటింగ్ కష్టాలు ఎదురయ్యాయి. ఈ మ్యాచ్ లో గిల్ జట్టును ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. గిల్ తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగితే టీమిండి యా బ్యాటింగ్ కష్టాలు చాలా వరకు తీరిపోతాయి. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై కూడా జట్టుకు భారీ అంచనాలు ఉన్నాయి. అతను కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. పంత్ తన మార్క్ బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలువక తప్పదు.

కరుణ్ ఈసారైనా?

సిరీస్‌లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సీనియర్ బ్యా టర్ కరుణ్ నాయర్‌కు మరో ఛాన్స్ లభించే అవకాశాలున్నాయి. మూడు టెస్టుల్లో నాయర్ పూర్తిగా తేలిపోయాడు. అయినా కూడా అతనికి మరో అవకాశం ఇచ్చేందుకు కెప్టె న్, ప్రధాన కోచ్‌లు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ అవకాశం లభిస్తే కరుణ్ తన బ్యాట్‌ను ఝులిపించాల్సిన ఉంటుంది. ఈ మ్యాచ్‌లో విఫలమైతే మాత్రం అతనికి మరో ఛాన్స్ లభించడం దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. దీంతో అం దివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టుకు అండగా నిలువాల్సిన బాధ్యత కరుణ్‌పై నెలకొంది.

బుమ్రాపైనే ఆశలు..

మరోవైపు బౌలింగ్‌లో టీమిండియా (Ind vs Eng Fourth Test) ఆశలన్నీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రాపైనే నెలకొన్నాయి. అతనికి చివరి రెండు టెస్టులకు విశ్రాంతి ఇవ్వాలని భావించినా కీలక బౌలర్లు ఆకాశ్‌దీప్, అర్స్‌దీప్, నితీశ్ కుమార్ రెడ్డిలు అందుబాటులో లేకుండా పోవడంతో బుమ్రాను ఆడించాల్సిన పరిస్థితి నెలకొంది. బుమ్రా ఫామ్‌లో ఉండడం టీమిండియాకు ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. సిరాజ్ కూడా జట్టుకు కీలకంగా మారాడు. యువ ఆటగాడు అన్షుల్ కంబోజ్‌కు ఈ మ్యాచ్‌లో అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. నితీశ్ కుమార్ దూరం కావడంతో అతనికి తుది జట్టులో ఆడించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. జడేజా రూపంలో మరో ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. శార్దూల్ కూడా బరిలోకి దిగడం ఖాయమనే చెప్పాలి.

సమరోత్సాహంతో..

ఆతిథ్య ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమతూకంగా ఉన్న ఇంగ్లండ్ సిరీస్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. బెన్ డకెట్,జాక్ క్రాలీ, ఓలి పోప్, జో రూట్, కెప్టెన్ స్టోక్స్, వికెట్ కీపర్ జేమీ స్మిత్‌లు జోరుమీదున్నారు. అంతేగాక ఆర్చర్, కార్స్, వోక్స్, స్టోక్స్‌లతో బౌలింగ్ కూడా బలంగా ఉంది. దీంతో ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News