- Advertisement -
టి20, వన్డేల్లో తలపడనున్న టీమిండియా
లండన్: టీమిండియా వచ్చే ఏడాది జులైలో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ 8 పరిమిత ఓవర్ల పోటీల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఐదు టి20లు, మరో 3 వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. 2026 జులై ఒకటిన డర్హమ్‌లో జరిగే తొలి టి20తో సిరీస్‌కు తెరలేస్తోంది.
జులై 4, ఏడు, 9, 11 తేదీల్లో ఇరు జట్ల మధ్య టి20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. అంతేగాక జులై14న తొలి వన్డే, 16న రెండో, జులై 19న మూడో వన్డే జరుగుతుంది. వచ్చే ఏడాది భారత మహిళా క్రికెట్ జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ సిరీస్‌లో భారత్ మూడు టి20లు, ఓ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడుతుంది. టెస్టు మ్యాచ్‌కు లార్డ్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది జులై 10 నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది.
- Advertisement -