టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్
ముంబై: ఇంగ్లండ్‌తో జ రిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ తమకు సవాల్ వంటిదేనని టీమిండి యా కెప్టెన్ శుభ్‌మన్ గి ల్ పేర్కొన్నాడు. ఇంగ్లం డ్ పర్యటనకు బయలుదేరి వెళ్లేముందు గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి గిల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా త న వ్యూహాల గురించి వెల్లడించాడు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై ఎదుర్కొవడం అనుకున్నంత తేలి కేం కాదన్నాడు. ఇది కెప్టెన్‌గా తనకు తొలి టెస్టు సిరీస్ కావడంతో కాస్త ఒత్తిడి ఉండడం సహాజమేనన్నాడు.
భారత్ వంటి జట్టుకు సారథ్యం వహించడం చాలా కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. అయితే తనపై ఎంతో నమ్మకంతో అప్పగించి న సారథ్య బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు సర్వం ఒడ్డుతానని స్పష్టం చేశాడు. సీనియర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, షమిలు లేకుండా సిరీస్‌లో బరిలో కి దిగుతున్నామని, ఇది అత్యంత క్లిష్టమైన అంశమన్నాడు. ఇ క జట్టును ఏకతాటిపై తెచ్చి ముందుకు సాగుతానన్నాడు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా ప్రతి క్రికెటర్‌తో స్నే హంగా ఉంటూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటానన్నా డు.
ఆటగాళ్లు ఎలాంటిఒత్తిడి లేకుండా ఆడేందుకు పూర్తి స్వే చ్ఛ ఇస్తానని తెలిపాడు. కోచ్ గౌతం గంభీర్ మాట్లాడుతూ క రుణ్ నాయర్ వంటి ఆటగాడు జట్టులో చేరడం ఆనందంగా ఉందన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన నా యర్ ఇంగ్లండ్ గడ్డపై కూడా మెరుపులు మెరిపిస్తాడనే నమ్మ కం తనకుందన్నాడు. ఇక శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదంటే దానికి అతని ఫామే కారణమన్నాడు. ఫామ్‌లో ఉన్న ఆ టగాళ్లకు జట్టులో చోటు ఎప్పుడూ ఉంటుందన్నాడు. అయ్యర్ విషయంలో తన పాత్ర ఏమీ లేదని గంభీర్ వివరించాడు.
తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ టీమ్ ఎంపిక
లండన్: భారత్‌తో జరిగే తొలి టెస్టు కోసం ఇంగ్లండ్ టీమ్‌ను గురువారం ప్రకటించారు. జూన్ 20 నుంచి మొదటి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం 14 మందితో కూడిన టీమ్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. బెన్ స్టోక్స్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఫాస్ట్ బౌలర్ గాస్ అట్కిన్సన్ గాయంతో తొలి టెస్టుకు ఎంపిక కాలేదు. ఫాస్ట్ బౌలర్ జేమీ ఒవర్టన్‌కు టీమ్‌లో చోటు లభించింది. బ్రైడన్ కార్స్ కూడా జట్టులో చోటు సంపాదించాడు.
జట్టు వివరాలు
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్; సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒ వర్టన్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, ఓలి పోప్, జోష్ టంగ్.