Sunday, September 14, 2025

పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలి: పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు

- Advertisement -
- Advertisement -

ముంబయి: భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై (Ind vs Pak Match) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్‌ ఆడుతున్నారని తెలిసి బాధపడ్డామని, ఆ దేశంతో ఎలాంటి సంబంధం ఉండొద్దని కోరుకుంటున్నారు. పాక్ తో మ్యాచ్‌ ఆడాలనుకుంటే.. పహల్గమ్ దాడిలో ప్రాణాలు పోయిన మావారిని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ ముగియలేదని పిఎం మోడీ చెప్పారని, మరి పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఎందుకు నిర్వహిస్తున్నారని పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు ప్రశ్నించారు.

Also Read: ఉపపోరు తప్పదు

పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ (Ind vs Pak Match Boycott) చేయాలని పహల్గామ్ దాడి ప్రత్యక్ష సాక్షులు శశిధర్, సుమిత్ర డిమాండ్ చేశారు. ఉగ్రవాదం పోషించే పాక్‌తో సంబంధాలు పెట్టుకోవద్దని, పాక్‌ తీరు మార్చుకునే వరకు నిరసన తెలపాలన్నారు. ఉగ్రవాద దేశమైన పాక్‌తో ఆటల్లోనూ పాల్గొనకూడదని, దేశంలో చాలామంది మ్యాచ్‌ ఆడొద్దని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. పాక్‌కు వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా సమర్థిస్తామని స్పష్టం చేశారు.

Ind vs Pak Match Boycott

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News