సరిహద్దుల్లో డ్రోన్ వార్
రెండు రోజులుగా విరుచుకుపడుతున్న పాక్ (Ind vs Pak) మధ్యలోనే ధ్వంసం చేస్తున్న
భారత గగనతల రక్షణ వ్యవస్థ శుక్రవారం రాత్రి నాలుగు సరిహద్దు రాష్ట్రాల్లోని
20 పట్టణాలు లక్షంగా డ్రోన్ దాడులు శత్రుదేశ పన్నాగాన్ని తిప్పికొట్టిన
భారత బలగాలు అవంతిపొరా ఎయిర్‌బేస్, శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌పై దాడికి
విఫలయత్నం నాలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బ్లాక్‌ఔట్, కమ్ముకున్న
చీకట్లు నియంత్రణ రేఖ వెంట భారీగా కాల్పులు, పేలుళ్ల శబ్దాలు
గురువారం రాత్రీ ఇదే తీరున 400డ్రోన్లతో తెగబడిన పాక్ 36 టార్గెట్లపై
దాడికి యత్నం నేలకూల్చిన భారత్ పౌర విమానాలు కవచంగా ఉపయోగించి
పాక్ డ్రోన్, క్షిపణి దాడులు భారత్ ప్రతిదాడుల్లో పాక్‌కు భారీ నష్టం నాలుగు
వైమానిక స్థావరాలు, రాడార్ వ్యవస్థ ధ్వంసం మీడియా సమావేశంలో
విదేశాంగ, రక్షణ శాఖ అధికారుల వెల్లడి ప్రార్థనా స్థలాలపై దాడులు
జరుపుతున్న పాక్ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రకటనలు విదేశాంగశాఖ
కార్యదర్శి విక్రమ్ మిస్రి సరిహద్దుల్లో భద్రత, రక్షణ, సన్నద్ధతలపై ఉన్నతస్థాయి
సమీక్షలు త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ భేటీ అవసరమైతే
టెరిటోరియల్ ఆర్మీని పిలిపించండి ఆర్మీ చీఫ్‌కు కేంద్రం విశేషాధికారాలు
సైరన్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ అన్ని రాష్ట్రాల సిఎస్‌లకు కేంద్రం లేఖ
శ్రీనగర్/న్యూఢిల్లీ : సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్ (Ind vs Pak)యథేచ్ఛగా కాల్పుల విరమణకు తూట్లు పొడుస్తోంది. శుక్రవారంనా డు రాత్రి నియంత్రణ రేఖతో పాటు జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరా త్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ల వర్షం కురిపించింది. ఆయా రాష్ట్రాల్లోని మొత్తం 20పట్టణాలను లక్షంగా చేసుకుంది. అయితే భారత బలగాలను పాక్ డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాయి. జమ్మూ కశ్మీర్‌లోని అవంతిపోరా ఎయిర్‌బేస్, ఎయిర్‌పోర్ట్‌పై దాడియత్నాన్ని బలగాలు భగ్నం చేశాయి. మరోవైపు శ్రీనగర్‌లో రాత్రి 9.22గంటలకు భారీ పేలుడు శబ్దం వినిపించింది. మూడు రాష్ట్రాల్లో పలు చోట్ల కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పఠాన్‌కోట్, సాంబా, జైసల్మీర్, బార్మర్, పోఖ్రాన్ ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు పాక్ యత్నించింది. పంజాబ్‌లోని అమృత్‌సర్, హోషియాపూర్, గురుదాస్‌పూర్, టార్న్‌టరన్‌లలో కూడా డ్రోన్‌దాడులకు దిగింది. ఫి రోజ్‌పూర్‌లోని జనావాసాలను డ్రోన్లు టార్గెట్ చేసుకున్నాయి.
ఈ ఘటన లో ఓ కుటుంబానికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. జమ్మూలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో పెద్ద ఎత్తున సైరన్ల మోత మోగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సిఎం ఒమర్ అబ్దుల్లా కూడా ధ్రువీకరించారు. స్థానిక మసీదుల్లోని మైక్‌లను ఉపయోగించి ఇళ్లలోని లైట్లను ఆపాలని అధికారులు ప్రజలకు సూచించారు. వెంటనే జమ్మూ వ్యాప్తంగా బ్లాక్‌ఔట్ పాటించడంతో పట్టణం మొత్తం చీకట్లు అలుముకున్నాయి.
సంబంధిత చిత్రాలను సిఎం తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఉధంపూర్‌లో పూర్తిగా బ్లాక్‌ఔట్ పాటించారు. అఖ్నూర్, సాంబా, పూంచ్ సెక్టార్‌లో పాక్ వైపు నుంచి కాల్పుల మోత మోగింది. ఎల్‌వోసి వెంట కాల్పుల శబ్దాలతో పాటు పేలుళ్లు జరిగినట్లు తెలిసింది. యూరీ, రాజౌరి సరిహద్దుల్లోని నివాసాలను పాక్ సేనలు లక్షంగా ఎంచుకుని కాల్పులకుదిగాయి. హర్యానాలోని పంచకులా, అంబాలోనూ బ్లాక్ ఔట్ పాటించారు. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్, జలంధర్, మోగా, ఫజిల్కాలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా దేశవ్యాప్తంగా పలు వ్యూహాత్మక ప్రాంతాల్లో కూడా బ్లాక్ ఔట్ పాటించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ సిడిఎస్‌తో పాటు త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో తాజా పరిస్థితిని సమీక్షించారు. భవిష్యత్ ప్రణాళికలపై వారితో ప్రధాని సమాలోచనలు జరిరు.