Monday, September 8, 2025

రైళ్లలో ఇక బయోమెట్రిక్ సైన్‌ఆన్ ద్వారా టికెట్‌ల తనిఖీ

- Advertisement -
- Advertisement -

టికెట్‌ల తనఖీల్లో డిజిటలైజేషన్ దిశగా దక్షిణ మధ్య రైల్వే అడుగులు వేస్తోంది. టికెట్ తనిఖీ కార్యకలాపాలను మరింత వాస్తవ, సమయ ప్రాతిపదికన పారదర్శకంగా చేయడానికి దక్షిణ మధ్య రైల్వే టికెట్ తనిఖీ సిబ్బంది కోసం బయో మెట్రిక్ సైన్- ఆన్ ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా డిజిటలైజేషన్ దిశలో మరో అడుగు ముందుకు వేసింది. ప్రారంభంలో జోన్ వ్యాప్తంగా ఆరు ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టిటిఈ)లాబీలు సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ స్థానాలను ప్రయోగాత్మకంగా బయో మెట్రిక్ సైన్-ఆన్/సైన్-ఆఫ్ ప్రవేశపెట్టడం కోసం ఎంపికచేశారు. ఆ తరువాత ఈ వ్యవస్థను జోన్ వ్యాప్తంగా ఉన్న అన్ని 73 టిటిఈ లాబీలలో అమలుచేయనున్నారు. గతంలో టికెట్ తనిఖీ సిబ్బంది సైన్-ఆన్,సైన్-ఆఫ్ కార్యాచరణ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్ ఉపయోగించి జరిగేది .

ప్రస్తుతం టికెట్ తనిఖీ సిబ్బంది లాగిన్ విధానాన్ని క్రమబద్ధీకరించడానికి, టిటిఈ లాబీలలో ఆధార్ ఆధారిత బయో మెట్రిక్ సైన్-ఆన్,సైన్-ఆఫ్ కార్యాచరణను ప్రవేశపెట్టారు. టిటిఈ లాబీ అప్లికేషన్‌లో ఫింగర్ ప్రింట్ పరికరాన్ని సి-డిఎసి పోర్టల్‌తో సరిగ్గా అనుసంధానించడం ప్రారంభించబడింది. దీని ద్వారా వారి సోర్స్ స్టేషన్, గమ్యస్థాన స్టేషన్‌లో టికెట్ తనిఖీ సిబ్బంది భౌతికంగా ఉండడాన్ని తెలియజేస్తుంది. టికెట్ తనిఖీ సిబ్బంది లాగిన్, లాగౌట్ సమయాలను వాస్తవ సమయ ప్రాతిపదికన రికార్డ్ చేయబడుతుంది. జోన్‌లో ఈ సాంకేతిక పురోగతిని అమలు చేసినందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వాణిజ్య సిబ్బందిని అభినందించారు. డిజిటల్ టెక్నాలజీలను అమలు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని, ఇందులో భాగంగా ఈ బయో మెట్రిక్ సైన్-ఆన్, సైన్-ఆఫ్ వ్యవస్థ అటువంటి మరొక డిజిటల్ చొరవ అని, వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News