ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో119.2 ఓవర్లలో 387 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ కూడా మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు ఆధిక్యం కూడా దక్కలేదు. శనివారం మూడో రోజు భారత్‌ను ఆశించిన దానికంటే తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో ఆతిథ్య జట్టు బౌలర్లు సఫలమయ్యారు. భారత జట్టులో ఓపెనర్ కెఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 13 ఫోర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు.
కరుణ్ నాయర్ (40) పరుగులు చేశాడు. ఇక వైస్ కెప్టెన్ రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచారు. పంత్ 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. జడేజా 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 72 పరుగులు సాధించాడు. నితీశ్‌కుమార్ రెడ్డి (30), వాషింగ్టన్ సుందర్ (23) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ మూడు, ఆర్చర్, స్టోక్స్ రెండేసి వికెట్లను పడగొట్టారు.